బలమైన కోరిక బలహీనుణ్ని కూడా బలవంతుణ్ణి చేస్తుంది
బలహీనమైన ఆశ బలవంతుణ్ణి కూడా బధ్ధకస్తుణ్ణి చేస్తుంది ---రానం

నేనే

నేనే


ప్రపంచమే ఒక పెద్ద బూటకం
అందున నాదో మహానాటకం
నటుణ్ణి నేనే, విటుణ్ణి నేనే
ఎదురెగి పోరాడే భటుణ్ణి నేనే
మంచిని నేనే చెడును నేనే
మంచిచెడుల మధ్యన వంచన నేనే
ఓటుని నేనే వేటుని నేనే
ఓటుతో వేటువేయనివ్వని నోటుని నేనే
ఎరుపు నేనే నలుపు నేనే
ఎరుపు నలుపుల మధ్య నలిగే తెలుపు నేనే
ప్రేమా నేనే ద్వేషం నేనే
ప్రేమా ద్వేషాల మధ్య రగిలే పగను నేనే
వయసు నేనే తనువు నేనే
వయసు తనువు చూపెట్టని మనసు నేనే
నింగిని నేనే నేలను నేనే
నింగికి నేలకు నిచ్చెన వేసే ఆలోచన నేనే
సుంగారం నేనే సంసారం నేనే
సంసారసుంగారం  కానరాని కామాంధకరం నేనే
సూర్యుడు నేనే చంద్రుడు నేనే
సూర్యచంద్రులను మింగే గ్రహణం నేనే
అంతా నేనే అంతర్యామి నేనే
సర్వం నేనే సర్వాంతర్యామి నేనే

No comments:

Post a Comment