బలమైన కోరిక బలహీనుణ్ని కూడా బలవంతుణ్ణి చేస్తుంది
బలహీనమైన ఆశ బలవంతుణ్ణి కూడా బధ్ధకస్తుణ్ణి చేస్తుంది ---రానం

పంద్రాగస్టు

పంద్రాగస్టు


సారూ మా మంచి సారూ
రేపే పంద్రాగస్టు, అయ్యో
అప్పుడే వచ్చిందా పంద్రాగస్టు
సరే నువ్వెళ్ళి మూడురంగుల
కాగితాలు తీసుకొచ్చి
తోరణాలు కట్టు
బూజుకర్ర బొంగుకు
మూడురంగులు కొట్టు
మూలన పడేసిన జెండాను
తీసి దులిపి దానికి కట్టు
జనగణమన వచ్చిన
పిల్లలను పెట్టు
ఉదయం వచ్చి నన్ను తట్టు
---
అయ్యా పంద్రాగస్టు
అంతా సిద్ధం సారూ
--
జెండా ఎగిరే
చప్పట్లు చప్పట్లు
సెల్యూట్ సెల్యూట్
పాటా పాటా
జనగణమన అదినాయక
...........................జయ
జయ జయహే 
అంతే
పంద్రాగస్టు అయిపొయే
అందరికి స్వీట్లు పెట్టు
సాయంత్రం అన్నీ తీసి
మూలన పెట్టు
అంతేనా సారూ పంద్రాగస్టు
అంతేరా పంద్రాగస్టు
అయ్యా జెండా రెపరెపలాడట్లేదు
షష్టిపూర్తి దాటిన జెండా
రెపరెపలాడటం కష్టం కదరా
మరి ఆడేది ఎప్పుడు దొరా
నవయువరాజకీయ గాలి వీయాలిరా
అయ్యా జెండా ఉల్టా ఎగరేసారు
ఫర్లేదురా ఓటుబ్యాంకు రాజకీయాలలో
మెజార్టీ ఎప్పుడు మైనార్టీయేరా

No comments:

Post a Comment