బలమైన కోరిక బలహీనుణ్ని కూడా బలవంతుణ్ణి చేస్తుంది
బలహీనమైన ఆశ బలవంతుణ్ణి కూడా బధ్ధకస్తుణ్ణి చేస్తుంది ---రానం

తెలుసు

తెలుసు
 
రాబోవు రోజులన్నీ
కష్టాలే అని తెలుసు
గడిచిన రోజులన్నీ
నష్టాలే అని తెలుసు
ఇక వచ్చే కష్టాలనే
ఇష్టాలుగా తలుస్తూ
ప్రతి అడుగు ముందుకు
ప్రసరించే కిరణంలా

నా

నా

మిధ్య యైన జగత్తు
మధ్య ఏ బంధాలు లేని
నేను ఒంటరిని
అన్నీ వదిలేసిన
నేను కర్మందిని
అయిన అందరూ
నా చుట్టే భ్రమిస్తారు
నిత్యం అనునిత్యం
నా నామం జపిస్తారు
ఎందుకింత
నా పై ప్రేమ
ఎందుకింత
నా పై అభిమానం
ఎందుకింత
నా పై కోపం
ఎందుకింత
నా పై తాపం
ఎందుకంటే
నేనొక యంత్రం, 
నా పేరొక మంత్రం
ఆచరణ అసాధ్యం
నా తంత్రం 

లేదు దైవం

లేదు దైవం

లేదు దైవం కొండల్లో బండల్లో
అది ఉంది నీ గుండెల్లో
లేదు దైవం గుర్తుల్లో విగ్రహామూర్తుల్లో
అది ఉంది నీ కర్మల్లో
లేదు దైవం మంత్రాల్లో యంత్రాల్లో
అది ఉంది నీ తంత్రంలో
లేదు దైవం భజనల్లో పూజల్లో
అది ఉంది నీ ఖలేజాలో

నిత్య పోరాటం


నిత్య పోరాటం

పుట్టేటప్పుడు ఏమి తెలియదు
పోయేటప్పుడు ఏమి రాదు
మధ్యలోనే మహా నాటకం
అన్నీ తెలిసి కూడా ఆరాటం
అందుకే తప్పదు నిత్య పోరాటం

వేసేయ్ వేసేయ్

వేసేయ్ వేసేయ్ 

వేసేయ్ వేసేయ్ ఓటు వేసేయ్
దుష్ట రాజకీయాలపై వేటు వేసేయ్
నొక్కెయ్ నొక్కెయ్ మీట నొక్కెయ్
నీచ రాజకీయాలపై తూటా నొక్కెయ్
దించెయ్ దించెయ్ గద్దె దించెయ్
రాబంధురాజకీయాల గుండెల్లో గునపం దించెయ్

మత్తెక్కి మత్తెక్కి

మత్తెక్కి మత్తెక్కి

మత్తెక్కి మత్తెక్కి
క్వార్టర్ మత్తెక్కి
చిత్తుచేయ్ చిత్తుచేయ్
దాయాదిని చిత్తుచేయ్
తుదిపోరులో పోరాడి
మదిగెలిచే విజయంతో
మత్తెక్కించెయ్ ధోనీసేనా
వందశతకాల వందను
చేరి భరతమాతకు
' వంద ' నాలు చేయి సచినా
వాడి వేడి షాట్లతో
పరుగుల సునామీతో
మొహాలీని ముంచెయ్ సెహ్వాగా
ఎక్కడ నీ దూస్రాలు
ఎక్కడ్ నీ యార్కర్లు
అంతుచిక్కని నీ ఆయుధాలను
అమ్ములపొదిలోనే దాచుతావా భజ్జీ
రాజువయ్యా యువరాజువయ్యా
ఆదుకొనే మహారాజువయ్యా  
అలుపెరుగక పోరాడు
అందించు ప్రపంచకప్ ను
అందరు ఆడాలి
అందంగా ఆడాలి
అందని ద్రాక్ష కాదు
ప్రపంచకప్పని నిరూపించాలి
విశ్వవిజేతగా భారత్ ను నిలపాలి
వందకోట్ల గుండెలను గెలవాలి 

 ---------

భారతదేశం గెలిచింది
కరీంనగర్ ఓడింది
మతఘర్షణలు చెలరేగి 

నేనే

నేనే


ప్రపంచమే ఒక పెద్ద బూటకం
అందున నాదో మహానాటకం
నటుణ్ణి నేనే, విటుణ్ణి నేనే
ఎదురెగి పోరాడే భటుణ్ణి నేనే
మంచిని నేనే చెడును నేనే
మంచిచెడుల మధ్యన వంచన నేనే
ఓటుని నేనే వేటుని నేనే
ఓటుతో వేటువేయనివ్వని నోటుని నేనే
ఎరుపు నేనే నలుపు నేనే
ఎరుపు నలుపుల మధ్య నలిగే తెలుపు నేనే
ప్రేమా నేనే ద్వేషం నేనే
ప్రేమా ద్వేషాల మధ్య రగిలే పగను నేనే
వయసు నేనే తనువు నేనే
వయసు తనువు చూపెట్టని మనసు నేనే
నింగిని నేనే నేలను నేనే
నింగికి నేలకు నిచ్చెన వేసే ఆలోచన నేనే
సుంగారం నేనే సంసారం నేనే
సంసారసుంగారం  కానరాని కామాంధకరం నేనే
సూర్యుడు నేనే చంద్రుడు నేనే
సూర్యచంద్రులను మింగే గ్రహణం నేనే
అంతా నేనే అంతర్యామి నేనే
సర్వం నేనే సర్వాంతర్యామి నేనే

పంద్రాగస్టు

పంద్రాగస్టు


సారూ మా మంచి సారూ
రేపే పంద్రాగస్టు, అయ్యో
అప్పుడే వచ్చిందా పంద్రాగస్టు
సరే నువ్వెళ్ళి మూడురంగుల
కాగితాలు తీసుకొచ్చి
తోరణాలు కట్టు
బూజుకర్ర బొంగుకు
మూడురంగులు కొట్టు
మూలన పడేసిన జెండాను
తీసి దులిపి దానికి కట్టు
జనగణమన వచ్చిన
పిల్లలను పెట్టు
ఉదయం వచ్చి నన్ను తట్టు
---
అయ్యా పంద్రాగస్టు
అంతా సిద్ధం సారూ
--
జెండా ఎగిరే
చప్పట్లు చప్పట్లు
సెల్యూట్ సెల్యూట్
పాటా పాటా
జనగణమన అదినాయక
...........................జయ
జయ జయహే 
అంతే
పంద్రాగస్టు అయిపొయే
అందరికి స్వీట్లు పెట్టు
సాయంత్రం అన్నీ తీసి
మూలన పెట్టు
అంతేనా సారూ పంద్రాగస్టు
అంతేరా పంద్రాగస్టు
అయ్యా జెండా రెపరెపలాడట్లేదు
షష్టిపూర్తి దాటిన జెండా
రెపరెపలాడటం కష్టం కదరా
మరి ఆడేది ఎప్పుడు దొరా
నవయువరాజకీయ గాలి వీయాలిరా
అయ్యా జెండా ఉల్టా ఎగరేసారు
ఫర్లేదురా ఓటుబ్యాంకు రాజకీయాలలో
మెజార్టీ ఎప్పుడు మైనార్టీయేరా

నేను మళ్ళీ పుట్టాను


నేను మళ్ళీ పుట్టాను

నేను మళ్ళీ పుట్టాను
ఇరవైఎనిమిది యేండ్ల తర్వాత
గడిచిన జీవితం
చీకటి మింగిన గతం
రాబోవు జీవితం
వెలుగును పంచు పురోగతం
నేను మళ్ళీ పుట్టాను
ఇరవైఎనిమిది యేండ్ల తర్వాత
 
దరిద్రం అనే రాక్షసుడు
దశావతారం ఎత్తి తన
కబంధహస్తాల మధ్య
నన్ను కబళించివేస్తుంటే
ధనం అనే స్వేచ్ఛావాయువు
కోసం నేను మళ్ళీ పుట్టాను
ఇరవైఎనిమిది యేండ్ల తర్వాత

చదువు లేక ఉద్యోగం లేక
నచ్చని పని చేయలేక
కన్నవారు ఉన్న ఊరు తిట్టగ
స్నేహితులు బంధువులు చులకనగా
చూడగా అందరికీ దూరమయి
ఏకాకిలా  నేను మళ్ళీ పుట్టాను
ఇరవైఎనిమిది యేండ్ల తర్వాత

అన్నీ సమస్యలను తీర్చేది
దేవుడే అని నమ్మే
అస్థిత్వం లేని ఆస్తికుడు
నుంచి అన్నింటికి పరిష్కారం
చూపుకునే నేనే దేవుణ్ని అని
నమ్మే స్వచ్ఛమైన నాస్తికుడుగా
మారుతూ నేను మళ్ళీ పుట్టాను
ఇరవైఎనిమిది యేండ్ల తర్వాత

గట్టువంటి కట్టడి మధ్య
నిశ్చలంగా ఉండి శోకించే
చెరువు లాంటి జీవితం వదిలి
గమ్యం తెలిసిన నదినై
గలగలపారే జీవనదిగా మారే 
జీవితం కోసం నేను మళ్ళీ పుట్టాను
ఇరవైఎనిమిది యేండ్ల తర్వాత

మనుష్యులం మనం మనుష్యులం


మనుష్యులం మనం మనుష్యులం

మనుష్యులం మనం మనుష్యులం
రాకెట్ చేసుకోని నింగికి చేరి
చందమామనైన తాకగలం
రోడ్డుపై గాయపడి ఆపదలో
ఉన్న సాటి మనిషిని తాకలేం
మనుష్యులమా మనం మనుష్యులమా
మనుష్యులం మనం మనుష్యులం
ఒక్కరోజు పెండ్లికోసం లక్షలైన
ధారాళంగా ఖర్చుపెడతాం
ఒక్కపూట కూడా తిండిలేని పేదవాడికి
బుక్కెడు బువ్వపెట్టం
మనుష్యులమా మనం మనుష్యులమా
మనుష్యులం మనం మనుష్యులం
పెద్దరాళ్ళు ఉన్న గుడి హుండీలో
ధనకానుకలు దండిగా వేస్తాం
పేదరత్నాలున్న బడి మండిలో
చిల్లిగవ్వ వేయక మొండిగా చూస్తాం
మనుష్యులమా మనం మనుష్యులమా
మనుష్యులం మనం మనుష్యులం
ప్రేయసి జ్ఞాపకార్ధం ప్రేమికుడు
కట్టించిన సమాధినైన ప్రేమిస్తాం
ప్రేమించిన ప్రేయసి నిరాకరిస్తే
కత్తి, కొడవలి, యాసిడ్లతో చంపేస్తాం
మనుష్యులమా మనం మనుష్యులమా
మనుష్యులం మనం మనుష్యులం
ప్రొద్దున్నే పత్రికలు చూచి స్కాం రాజకీయాలపై
సంస్కరణలు చేయని ప్రభుత్వాలపై చర్చిస్తాం
అయిదేండ్లకోసారి ఆవకాశం వస్తే మాత్రం
చీరె, సారె, పైకం, మందు, మాయమాటలతో  మర్చిపోతాం
మనుష్యులమా మనం మనుష్యులమా


ఎవడు వాడు


ఎవడు వాడు

ఎవడు మెచ్చువాడు
ఎవడు గిచ్చువాడు
నచ్చితే మెచ్చుతాడు
నచ్చకుంటే గిచ్చుతాడు
నచ్చడం నచ్చకపోవడం 
వాడి ఖర్మ
నచ్చినట్టు బ్రతకడం
నీ కర్మ

బిచ్చగాడు

బిచ్చగాడు 

అన్నం అడిగేవాడు  బిచ్చగాడు
అధికారం అడిగేవాడు  బిచ్చగాడు
ఆకలి లేనివాడికి వేయకు బిచ్చం
అర్హత లేనివాడికి వేయకు బిచ్చం
అపాత్రదానం చేస్తే అవుతావు
చివరికి నువ్వు ఓ బిచ్చగాడు

వెళ్ళు వెళ్ళు

వెళ్ళు వెళ్ళు

చాలు చాలు ఇక చాలు చాలు
తండ్రి భుజాలు పట్టుకు వ్రేలాడు
గబ్బిలపు జీవితం చాలు
వెళ్ళు వెళ్ళు ఇకనైన వెళ్ళు వెళ్ళు
కూటి కోసం కూలీ కోసం
గూడు కోసం గుడ్డ కోసం
అడ్డొచ్చిన అగాధాలు పూడ్చుతూ
నిలువరించే కొండలు కూల్చుతూ
గుచ్చుకునే ముల్లులు ఏరుతూ
విసిరే రాళ్ళను పేర్చ్చుతూ
భయపెట్టే భయాలు వదులుతూ 
మత్తు పెంచే అలవాట్లను విడుస్తూ
వెళ్ళు వెళ్ళు ఇకనైన వెళ్ళు వెళ్ళు

కూటి కోసం కూలీ కోసం
గూడు కోసం గుడ్డ కోసం

జీవితం ఒక ఆట

జీవితం ఒక ఆట

జీవితం ఒక ఆట
ఆడరా ప్రపంచం అనే చోట
కాసులు లేని ఆట
సాగదు ఏ పూట

పుట్టినప్పుడు తెలియదు
ఎలా ఆడాలో ఈ ఆట
ఊహా తెలిసి మొదలెట్టాకే
ఊహాకందని మలుపులు
ఊహించని కష్టాలు
ఓటమి చెప్పే పాఠాలు
చెపుతాయి ఎలా ఆడాలో ఈ ఆట

మనసు ఆడే ఆట
తోడు కోరే సయ్యాట
తప్ఫటడుగు వేస్తే
పాతాళం దీని బాట

గమ్యం లేని ఆట
గాలివాటపు ఆట
లక్ష్యం లేని ఆట
భిక్షమే ప్రతీ పూట

ఎవరికోసం ఆడకు ఈ ఆట
నీకోసమే ఆడు ఈ ఆట
భవబంధాల మూట
కట్టిపడేసేయి ఓ చోట

ఆడు ఇక ఈ ఆట
వేసుకో నీకై ఓ పూల బాట